7 August, 2026 | 9:49 PM

Breaking News

అడవిముత్తారం పోలీసుల చాకచక్యంతో దొంగల ముఠా అరెస్ట్   •   తెలంగాణ ఉద్యమకారుల సమితి కోదాడ అధ్యక్షులుగా బొలిశెట్టి కృష్ణయ్య   •   ఆలయ పునర్నిర్మాణంపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు   •   యూఎస్పీసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   రిపుల్స్ లర్నింగ్ పాఠశాలలో ఘనంగా బోనాల ఉత్సవాలు   •   సాగర్ ఎడమ కాలువకు వెంటనే నీరు విడుదల చేసి చెరువులు నింపాలి   •   గరిడెపల్లి న్యూ జనరేషన్ స్కూల్‌లో కనుల పండుగలా బోనాల వేడుకలు   •   బీరంగూడలో యువకుడిపై కత్తులతో దాడి   •   సీనియర్ సిటిజన్స్‌కు ఎన్ని భవనాలు?   •   ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ నల్ల బ్యాడ్జీలతో నిరసన   •  

వరి నుంచి ఆయిల్‌పామ్ వైపు రైతుల అడుగులు

07-08-2026 08:37 PM

చివ్వెంల: పంటల వైవిధ్యీకరణలో భాగంగా రైతులు అధిక నీటి వినియోగం ఉండే వరి సాగును తగ్గించి, ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు అడుగులు వేయాలని మండల వ్యవసాయ అధికారి డి. వెంకటేశ్వర్లు సూచించారు.

చివ్వెంల గ్రామానికి చెందిన రైతు నంద్యాల సోమిరెడ్డి గతంలో వరి సాగు చేసిన 10 ఎకరాల భూమిలో ఆయిల్‌పామ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా పొలాన్ని పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ... భూగర్భ జలాలను పరిరక్షించడంతో పాటు రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం అందించేందుకు పంటల వైవిధ్యీకరణ అవసరమని అన్నారు.

రైతులు తమ భూమి, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆయిల్‌పామ్, కంది, పెసర, మినుము వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని అనుకూలమైన భూముల్లో ఆయిల్‌పామ్ సాగును చేపట్టాలని కోరారు.