7 August, 2026 | 9:49 PM

Breaking News

అడవిముత్తారం పోలీసుల చాకచక్యంతో దొంగల ముఠా అరెస్ట్   •   తెలంగాణ ఉద్యమకారుల సమితి కోదాడ అధ్యక్షులుగా బొలిశెట్టి కృష్ణయ్య   •   ఆలయ పునర్నిర్మాణంపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు   •   యూఎస్పీసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   రిపుల్స్ లర్నింగ్ పాఠశాలలో ఘనంగా బోనాల ఉత్సవాలు   •   సాగర్ ఎడమ కాలువకు వెంటనే నీరు విడుదల చేసి చెరువులు నింపాలి   •   గరిడెపల్లి న్యూ జనరేషన్ స్కూల్‌లో కనుల పండుగలా బోనాల వేడుకలు   •   బీరంగూడలో యువకుడిపై కత్తులతో దాడి   •   సీనియర్ సిటిజన్స్‌కు ఎన్ని భవనాలు?   •   ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ నల్ల బ్యాడ్జీలతో నిరసన   •  

సంప్రదాయానికి ప్రతీక మన చేనేత వస్త్రాలు

07-08-2026 08:34 PM

ముకరంపుర,(విజయ క్రాంతి): మన తెలుగు సంప్రదాయానికి ప్రతీక అయిన చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ప్రోత్సహిద్దామని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని   పేర్కొన్నారు.అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.  ఈ సమావేశంలో చేనేత జౌళి శాఖ ఏడీ రాఘవరావు, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం, మాజీ మేయర్ రవీందర్ సింగ్,  కార్పొరేటర్ వాసాల రమేష్,  కార్మికులు తదితరులు పాల్గొన్నారు.