27 April, 2026 | 7:07 PM

గర్రెపల్లిలో గుడుంబా స్థావరాలపై విస్తృత దాడులు

27-04-2026 05:45 PM

ఇద్దరిపై కేసు నమోదు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి డీపీఈఓ మహిపాల్ రెడ్డి, సుల్తానాబాద్ ఎక్సైజ్ సీఐ గురునాథ్ ఆదేశాల మేరకు సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో గుడుంబా స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహించి 7 లీటర్ల నాటు సారా, 10 కిలోల బెల్లం,15 కిలోల పటిక స్వాధీనం చేసుకొని, 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి ఇద్దరు వ్యక్తులుపై కేసు నమోదు చేసినామని ఎక్సైజ్ ఎస్సై చిరంజీవి తెలిపారు. కరీంనగర్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై వెంకటేశ్వర రావు, పెద్దపల్లి డిటిఎఫ్  ఎస్సై పావని  టీం లతో దాడులలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గర్రెపల్లి గ్రామంలో ఎవరైన గుడుంబా తయారు చేసిన,అమ్మిన, రవాణా చేసిన చట్ట రీత్యా కఠిన చర్యల ఉంటాయని హెచ్చరించారు.