27 April, 2026 | 7:27 PM

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేసిన గోరక్షకులు

27-04-2026 05:41 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): గోఆరాధన గోప్రచార ఉద్యమం ఆధ్వర్యంలో సోమవారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గోరక్షణ కోసం వినుత కార్యక్రమాన్ని నిర్వహించారు.వేణుగోపాల స్వామి ఆలయం నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు భజనలతో ఊరేగింపుగా వెళ్లి గోమాత రక్షణకు మద్దతుగా గోభక్తులు గోరక్షకులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గోభక్తులు గోరక్షకుకులు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో భారతీయ సంస్కృతి, రాజ్యాంగ అనుసారంగా, అహింసా మార్గంలో భారతీయ గోఅంశ రక్షణ కొరకు జరిగే గోఆరాధన కార్యక్రమాలను గౌరవించి ఆదరించాలి.

భారతీయ దేశంలో సంపూర్ణ గోహత్య నివారణలో గల ప్రతిబంధకాలు, గోవును దేశమాతగా, ఆరాధ్యనీయ దేశదేవతగా, దేశ ఓవుణ్యత్వానికి చిన్నముగా గౌరవింపబడవలెను, గోసేవా కొరకు కేంద్ర ప్రభుత్వంను, గోసేవ మంత్రత్వ శాఖను ఏర్పాటు చేయవలెనని, గోపరిరక్షణ బోర్డును ఏర్పాటు చేసి వేదలక్షలు కలిగి ఉన్న గోఆధారిత పంచగవ్య ఆత్పాదనల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని దేశం మొత్తం మీద ఒకేరోజు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందనీ కోరుతూ నాగిరెడ్డిపేట్ తాసిల్దార్ బిక్షపతికి గోరక్షకులు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో గోసన్మాన్ ఆహ్వాను అభియాన్ సభ్యులు పాల్గొన్నారు.