కేంద్రీయ విశ్వవిద్యాలయంపై రాజకీయం తగదు
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల, జూన్ 17 (విజయక్రాంతి): కేంద్రీయ విద్యాలయంపై ఎంపీ అరవింద్ తీరు మారడం లేదనికేంద్రీయ విద్యాలయం ఏర్పాటును కావాలని రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంపీ అరవింద్ వారి అనుచరులు చేస్తున్న వాఖ్యలపై స్పందిస్తూ జగిత్యాల మేధావులు ప్రజలకు తెలియజేస్తున్న కేంద్రీయ విద్యాలయం 5 ఎకరాల స్థలం కేటాయింపుకు కలెక్టర్ సర్వే చేసి డిప్యూటీ కమిషనర్ కేంద్రీయ విద్యాలయం సంఘటన్ కు 10 రోజు ల క్రితం సంబంధిత పత్రాలు పంపించారని,కరీంనగర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి తో 2011 లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేశారని 2017 లో 7 ఎకరాల స్థ లం లో ఎల్‌ఎండి కి మార్చారని గుర్తు చేశా రు.
కేంద్రం దేశంలో ప్రతి జిల్లాకు నవోద య కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయటం జరుగుతుందని జగిత్యాల జిల్లా ఏ ర్పడ్డ 9 ఎండ్ల కు మంజూరు ఇచ్చారని అ న్నారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు పాత ఎస్పీ కార్యాలయం కేటాయించడం జ రిగిందని,కొన్ని చిన్నపాటి మరమ్మత్తులు కూ డా చేపట్టడం జరిగిందని, చల్గల్ లో 5 ఎకరాలలో స్థలం కలెక్టర్ కేంద్రీయ విద్యాల యం సంఘటన్‌కు పంపారని అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా కృషి చేస్తున్నారు అని అన్నారు.
ఎంపీ వైఖరి మా రాలని జగిత్యాల మేధావులు ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.గతంలో వాలంతరి క్షేత్రం సేవలు నామ మాత్రంగా ఉండడం వ ల్ల కోరగానే గత ప్రభుత్వం లో పండ్ల వ్యాపారులకు స్థలం కేటాయించడం జరిగింది.గతం లో మంత్రి గా చేసిన జీవన్ రెడ్డి హయాంలో సైతం వ్యాపారులు షెడ్లు వేసుకొని వ్యాపారం చేశారు.వారికి కూడా డ బ్బులు ఇచ్చారా అని ప్రశ్నించారు.కావాలని వ్యక్తిగత దూషణలు,వ్యక్తిత్వ హననం చేయ టం తగదని ప్రజలు అన్ని గమనిస్తారు అని అన్నారు.
డబ్బుల కోసం రాజకీయాలు చేసే వ్యక్తిత్వం తనది కాదని అన్నారు.కేంద్రం చల్గ ల్ వాలంతరి క్షేత్రం ను శాస్త్ర వేత్తలకు రైతు లుకు జాతీయ సహజ వ్యవసాయ శిక్షణ కో సం 2025 ఏప్రిల్ 26 న కేంద్రం రాష్ట ప్రభుత్వనికి వాలంతరి క్షేత్రం ఉపయోగపడాలని లేఖ పంపిందని దానిలో భాగంగా మం త్రి ఉత్తమ్ కుమార్ కేంద్రీయ విశ్వవిద్యాల యం 2 ఎకరాలు,ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు 10 ఎకరాలు కేటాయించారని అన్నారు.
నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాలంతరి క్షేత్రంను సహజ వ్యవసాయ ఆర్గానిక్ ఫామ్ కోసం ఉ పయోగించాలని ఆలోచన చేస్తున్నాయి అని అన్నారు.కేంద్రీయ విద్యాలయం చల్గల్ అని జీవో తేవడం తో ఇబ్బందిగా మారిందని అ న్నారు.అయినా ప్రజల కోరిక మేరకు జిల్లా కలెక్టర్,రెవెన్యూ అధికారులు 5 ఎకరాల స్థ లం కోసం పూర్తి సర్వే సిద్ధం చేసిందని కేం ద్రీయ విద్యాలయం సంఘటన్ కు పంపారని అన్నారు.ఇప్పటికైనా కేంద్రీయ విద్యాలయంపై రాజకీయాలు మానుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాం గ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య ,మాజీ ము న్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, జ్యోతి లక్ష్మణ్ ,పిసిసి సెక్రెటరీ బండ శంకర్, నాయకులు గట్టు సతీష్, మన్సూర్, చాంద్ పాషా, కొత్తమోహన్, అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, కమల్,బాలముకుందం, దుమల రాజకుమార్, అచ్యుత్ రావు ,నారపాక రమేష్, ప్ర శాంత్ రావు ,బీరం రాజేష్, సాయి, ముఖేష్ ఖన్నా ,కూతురు రాజేష్ , క్యదసు నవీన్, రామకృష్ణ రెడ్డి ,నలువల సురేష్, మల్లేశం గౌడ్ ,శ్రీనివాస్, ఆరుముల్ల పవన్ ,సత్తన్న, నరేష్ తదితరులు పాల్గొన్నారు.






