18 June, 2026 | 2:41 AM

విమానం కూలి ఒకరి మృతి

18-06-2026 01:23 AM

పలువురికి గాయాలు, దక్షిణ టెక్సాస్‌లో ఘటన 

టెక్సాస్, జూన్ 17: దక్షిణ టెక్సాస్‌లోని రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. నెట్‌జెట్‌కు చెందిన ఓ విమానం కుప్పకూలింది. ఈ విమానం మంగళవారం రాత్రి శాన్ జోస్ డెల్ కాబో నుంచి లారెడో విమానాశ్రయానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మిగతవారంతా సురక్షితంగా బయటపడ్డట్లు లారెడో పోలీసులు తెలిపారు. విమానం రోడ్డుపై కూలడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి.

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ మంటలను ఆర్పివేసింది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు బయటకు వచ్చేందుకు కాక్‌పిట్ అద్దాలను పగలగొట్టారు. చిన్నవిమానం కావడం, తక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉండడం, ఇంధనం తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు వివరించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, కొన్ని గంటలపాటు హైవేను మూసివేశామని చెప్పారు. ఈ ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.