18 June, 2026 | 1:41 AM

సమసిపోని అన్నల జాడలు

18-06-2026 12:15 AM
  1. సింగరేణిలో మరోసారి సికాసపై చర్చ
  2. అన్నలు ఎక్కడికి పోలేదు..
  3. టీఆర్‌ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత వ్యాఖ్యల దుమారం

బెల్లంపల్లి, జూన్ 17: విప్లవోద్యమ జీవగడ్డ సింగరేణిలో మరోసారి అన్నల (మావోయిస్టుల) పేరు మార్మోగుతున్నది. అన్నల పోరాటాలు, జ్ఞాపకాలు తెరపైకి రావడం సిం గరేణిలో భారీ చర్చకు తెరలేపాయి. దండకారణ్యంలో మావోయిస్టుల నిర్మూలన కోసం కాగార్ ఆపరేషన్ చేపట్టిన విషయం విదితమే. మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అన్నల ఏరివేత చేపట్టింది. ఇది సాధ్యం కాలేదు. కాగా ఈ ఘట్టం పరి పూర్తికాలేకపోయింది.

కేంద్ర ప్రభుత్వం మా త్రం నిర్దేశిత గడువులోనే మావోయిస్టుల్ని దాదాపుగా తుదముట్టించామని ప్రకటించిం ది. ఇక అప్పటి నుంచి  అన్నలు పేరు ఉనికిలో వినిపించకుండా కనుమరుగవతదని భావించారు. ఈనేపథ్యంలో టీఆర్‌ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత సింగరేణిలో బాయి బాట కార్యక్రమం పేరుతో పర్యటన చేస్తున్నారు. శ్రీరాంపూర్ బొగ్గు బావుల్లో పర్య టించిన సందర్భంగా కవిత చేసిన కీలక వ్యా ఖ్యలు సంచలనం సృష్టించాయి.

అన్నలు లేరని బాయి దొరలు కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనీ, అన్నలు ఎక్కడికి పోలేదని, అన్నలు మా పార్టీలోనే ఉన్నారని చేసిన సంచలన వ్యాఖ్యలు సింగరేణిలో దుమారం లేపాయి. ఈ వ్యాఖ్యలు కార్మకలోకంలో నూతనోత్సాహాన్ని నింపాయనీ పరిశీ లకులు భావిస్తున్నారు. ప్రభుత్వం నిర్మూలించినట్టు చెబుతున్న ఈ తరుణంలో అన్నలు పేరు ఉటంకించకూడా కార్మికుల మనసులను గెలుచుకోవడం ఎవరికి సాధ్యంకాదని కవిత మాటలు అందుకు నిదర్శనంగా నిలిచాయని విశ్లేషకులు అంటున్నారు.

అన్నలకు సింగరేణిలో ఎనలేని ప్రేమానురాగాలు ఉన్నాయని మరోసారి కవిత మాటలు రుజు వు చేశాయని నిపుణులు అంటున్నారు. అన్నలు సింగరేణిలో భౌతికంగా లేకున్నప్పటీకి వారిపై ఉన్న సానుభూతి, అభిమానం మాత్రం సజీవంగానే ఉంది. అది మాత్రం తగ్గలేదు. సింగరేణిలో అన్నలు పేరు ఎప్పటికీ సమసి పోలేదు. పొదుకూడా. వారె ప్పుడూ కార్మికుల జీవితంలో నుంచి విడిపోరని అంటున్నారు.

సమాజంలో ముఖ్యంగా పీడిత ప్రజలకు మావోయిస్టులకు ఉన్న వర్గ సంబంధాలు, పోరాటాలు అంతర్లీనమని పరిశీలకుల ఉవాచ. ప్రస్తుతం మావోయిస్టుల అలజడి లేక సింగరేణి మూగబో యింది. వారి జ్ఞాపకాలు, పోరాట ఫలాలకి చావులేదు. చాలాకాలంగా సింగరేణి స్తబ్దతంగా కనిపించిన అన్నలు పేరు కవిత నో టితో మరోసారి అలజడి రేగింది. అన్నలకు కేరాఫ్ సింగరేణి అనే విషయం మరోసారి  స్పష్టమైంది.

సింగరేణిలో అన్నల పోరాటాల ఊసులు కార్మిక స్రవంతిలో చర్చకు రాకుం డా లేని రోజూ లేదంటే అతిశయోక్తి కాదు. సింగరేణిలో కార్మిక హక్కుల కోసం చరిత్రాత్మకమైన పోరాటాలు, కార్మికుల జీవితాల్లో భాగమయ్యాయి. అంతేకాకుండా పోరాటాల ఫలితం వారి జీవితాల్లో పెనుమా ర్పులకి దారితీసింది. దశాబ్దాల తరబడి సింగరేణిలో అలుపెరగనీ సికాస పోరాటా లు, ప్రభావాలు అంతసులవుగా సమసి పోయేటివీకాదూ.

ప్రత్యక్షంగా మావోయిస్టులు ఇప్పడు సింగరేణిలో లేకున్నా వారి జ్ఞాపకాలు, జాడలు అణిచివేత, హక్కుల హరణ దోపిడీ పీడనలు, మావోయిస్టులను గుర్తు చేస్తుంటాయి. అందులో భాగంగానే టీ ఆర్ ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత వ్యాఖ్యల్ని అవగతం చేసుకోవాలి. అన్నలు పేరు చెబితేనే కార్మికల్లో ప్రేరణ, పోరాట స్పూర్తి రగలుతుంది. ఉద్యమాలకు ప్రతీక అయినా అన్నలు నామస్మరణ లేకుండా సింగరేణిలో ఎవరికీ గొంతు పేకలదు.

అంతెందుకు బెల్లoపల్లిలో జెండా ఆవిష్కరణ అనంతరం టీఆర్‌ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత నేరుగా ఇంద్రవెల్లి స్థూపం వద్దకు వెళ్లి అమరవీరులకు నివాళులర్పించి పోరాట ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. మావోయిస్టుల జోలి లేకుండా ప్రజలు, కార్మికుల సానుభూతి చురగొనడం సాధ్యం కాదనే సంగతి ఇప్పటికి అనేకమార్లు నిరూపితం అయ్యింది. తెలుగు సినిమా రంగం నుంచి తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ నక్సలైట్లు దేశభక్తులు అన్నారు.

సినిమాల్లో నక్సలైట్లు ఇతివృత్తం లేకుండా సినిమాలు లేవు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష కాలంలో అప్పటి అధికార పార్టీ  బీ ఆర్ ఎస్ ను డ్యామేజ్ చేయడానికి అన్నలు ఉండాలని వ్యాఖ్యలు చేశారు. అన్నలు పేరు ఒక వజ్రాయుధం. అందుకే వారి ఉచ్చరణ, స్మరణ చేయని పరిస్థితి సమాజంలో ఉం డదు. మావోయిస్టులు, ప్రజా ఉద్యమాలు సన్నగిల్లిపోయినా ఉద్యమాల ప్రేరణకు మావోయిస్టులు ఆక్సిజన్ లాంటి వారు. ఎవరైనా ఏపార్టీ వారైనా మావోయిస్టులను జ్ఞాపక దర్శనం చేసుకోవాల్సిందే..