22 May, 2026 | 3:39 AM

ధర్మపురిలో పోలీసుల విస్తృత తనిఖీలు

22-05-2026 12:41 AM
  1. గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాలు విక్రయిస్తే కఠిన చర్యలు 
  2. ‘ధర్మపురి సీఐ రాం నర్సింహారెడ్డి 

ధర్మపురి,మే21(విజయక్రాంతి): పంచాయి మరియు ఇతర నిషేధిత మాదకద్రవ్యాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ. రాం నరసింహారెడ్డి హెచ్చరించారు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో గంజాయి మరియు ఇతర నిషేధిత మాదక ద్రవ్యాల కోసం గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ధర్మపురి పట్టణంలోని ప్రధాన కిరాణా దుకాణాలు, టీ స్టాళ్లు, పాన్ షాపులు మరియు అనుమానాస్పద ప్రాంతాలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించామన్నారు.గంజాయి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందనీ, గంజాయి విక్రయాలు,రవాణా లేదా వినియోగంలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్త్స్ర జి. మహేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.