6 April, 2026 | 2:24 AM

సైబర్ క్రైమ్, ట్రాఫిక్, క్రైమ్‌పై సమీక్ష

06-04-2026 12:41 AM

ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర డీజీపీ బీ. శివధర్‌రెడ్డి

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): సైబరాబాద్ సీపీ ఆఫీస్ ఆడిటోరియంలో సైబర్ క్రైమ్,ట్రాఫిక్ పరిస్థితులు, క్రైమ్స్ ఇత ర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ డిజిపి బి.శివధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. ట్రాఫిక్ భద్రతపై అత్యంత కీలకమైన సూచనలు చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహన దారు లు పాదచారుల మరణాల సంఖ్య పెరుగుతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, అలైవ్ అరైవ్  కార్యక్రమంలో భాగం గా ఈ నెల 13 నుంచి 18 వరకు రోడ్డు ప్ర మాదాలు,ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారు లను ఆదేశించారు.

‘పెడ్స్ట్రియన్ కింగ్ ఆన్ ది రోడ్‘ (పాదచారులే రోడ్డుపై రాజులు) అనే నినాదం ఉన్నప్పటికీ, వారి ప్రాణాలు ప్రమాదాల్లో పోవడం దురదృష్టకరమని, దీనిని అరికట్టడానికి రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

కుటుంబ పోషణలో కీలక పాత్ర పోషించే 4245 ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని, తద్వారా ఆయా కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా వీధిన పడు తున్నాయని డీజీపీ గుర్తుచేశారు. ఈ క్రమం లో ప్రతి డ్రైవర్ చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తూ వాహనం నడిపే ‘డిఫెన్సివ్ డ్రైవిం గ్‘ (రక్షణాత్మక డ్రైవింగ్) పద్ధతిని అలవర్చుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత అనేది కేవలం నిబంధనల అమలు మాత్రమే కాద ని, అది ఒక బాధ్యతగా ప్రతి పౌరుడికి తెలిసేలా ఈ అవగాహన కార్యక్రమాలు రూ పొందించాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో కుత్భు ల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి, ఐపీఎస్, అడ్మిన్ డీసీపీ టి. అన్నపూర్ణ, ఐపీఎస్,శేరిలింగంపల్లి డీసీపీ  సి.హెచ్. శ్రీనివాస్, ఐపీఎస్, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, ఐపీఎస్, ట్రాఫిక్ డీసీపీ -2 ఎస్. శేషాద్రిని రెడ్డి, ఐపీఎస్., డీసీపీ క్రైమ్స్ ముత్యం రెడ్డి, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ వై.వి.ఎస్. సుధీంద్ర, సైబర్ క్రైమ్స్ డీసీపీ టి. సాయి మనోహర్,  సైబరాబాద్ సీఏఆర్ హెడ్క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, ట్రాఫిక్ డీసీపీ -1 రంజన్ రతన్ కుమార్ వివిధ పోలీసు అధికారులు పాల్గొన్నారు.