మున్సిపాలిటీ సమస్యలపై పరిశీలన
మొయినాబాద్, జూలై 3 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి శుక్రవారం మొయినాబాద్ మున్సిపాలిటీని సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ షాబాద్ సోనియా దర్శన్ ఆమెను కలిసి,మున్సిపాలిటీలోని ప్రధాన సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ స్థానిక అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.
మున్సిపాలిటీ లో పేదల ఇళ్ల స్థలాలు, డంపింగ్ యార్డ్ స్థలాల తో పాటు గుడిమల్కాపూర్ మార్కెట్ స్థలం, పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు స్థలాలు,బాలాజీ ఆలయం ఎదుట అతిథి గృహ నిర్మాణం, నూతన మున్సిపల్ కార్యాలయ ప్రతిపాదిత స్థలాల ను ఆమె పరి శీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
మున్సిపాలిటీ అభివృద్ధిలో అధికారులు తమ వంతు పాత్రను పోషించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథ కాలు అర్హులకు అందేలా అధికారులు చర్య లు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, తహసీ ల్దార్, వార్డు కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొని స్థానిక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.






