18 May, 2026 | 4:02 PM

క్రీడలపై ఆసక్తి అందరికి ఉండాలి

18-05-2026 02:42 PM

ఉట్నూర్, మే 18 (విజయక్రాంతి): నేటి యువత క్రీడలు పరుగు పందాల పైన ఆసక్తి చూపాలి  ఇంద్రవెల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్  మోహన్ సింగ్ రాథోడ్ అన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా  ఇంద్రవెల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన 2 కే రన్  ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు, వ్యాయామం ఎంతో ఉపయోగంగా ఉంటుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో  ఎంపీడీవో జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు  రవీందర్ రెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.