అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి
అలంపూర్, జూన్ 4: వడ్డేపల్లి మున్సిపాలిటీ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే వార్డు సభల ముఖ్య ఉద్దేశమని వడ్డేపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ మంజుల ధర్మ ఆకాంక్షించారు.
ఈ మేరకు గురువారం వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా పూర్తయిన సందర్భంగా 3వ, 4వ వార్డుల్లో నిర్వహించిన ప్రత్యేక వార్డు సభలో ఆమె పాల్గొన్నారు...ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.గత 99 రోజులలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించారు.
ఒక మార్పు అభివృద్ధికి మలుపు నినాదంతో ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు.3వ వార్డు కౌన్సిలర్ చిన్ని బాబు మాట్లాడుతూ... వార్డు అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.ప్రజల సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని..సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలని సూచించారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






