తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
05-06-2026 01:32 AM
కేసముద్రం, జూన్ 4 (విజయక్రాంతి): కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కూలి మంద సారయ్య (40) అనారోగ్యంతో మరణించాడు. అతని దీన పరిస్థితి చూసి గ్రామస్తులంతా తలా కొంత ఆర్థికంగా సహకరించి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడు సారయ్యకు భార్య అమల, కుమార్తె ప్రియ ఉండగా, కుమార్తె ప్రియ తలకొరివి పెట్టింది.






