5 August, 2026 | 2:58 AM

మురికి కాలువ నిర్మాణాన్ని ప్రారంభించిన చైర్మన్

05-08-2026 01:58 AM

జహీరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): జహీరాబాద్ మున్సిపాలిటీ వార్డులలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని స్థానిక మున్సిపల్ చైర్మన్ మొహమ్మద్ యూనిస్ అన్నారు. మంగళవారం 22వ వార్డులో మురికి కాలువల నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన మురుగు కాలువలు రోడ్లను మరమ్మత్తులు చేయడంతో పాటు కొత్త రోడ్లు, కొత్త కాలువలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

ప్రస్తుతం కొద్దిపాటి వర్షానికి రోడ్లన్నీ చిత్తడిగా మారి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిసి రోడ్ల నిర్మాణాలు, మురుగు కాలువ నిర్మించేందుకు దశలవారీగా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి.ప్రభాకర్,  ఏఈ ఖాజా, వార్డ్ కౌన్సిలర్ జేబిలోద్దీన్, కౌన్సిలర్లు జహంగీర్, అక్రమ్, బర్కత్ ముఖిమ్,  మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.