5 August, 2026 | 2:01 AM

కారేపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన పోలీస్ కమిషనర్

05-08-2026 01:15 AM

కారేపల్లి, ఆగస్టు 4 (విజయక్రాంతి): కారేపల్లి పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. వార్షిక తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ కు నిర్వహణ, పోలీసుల పనితీరు, విచారణ నివేదికలు, జనరల్ డైరీ రికార్డులను, సీజ్ చేసిన వాహనాలు, పరిసరాలను పరిశీలించారు. సెక్టర్ పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడారు. సర్కల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని సందర్శించారు.

నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలలో అవగాహన పెంపొందించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన కేసులు, డయల్ 100 కాల్స్ ప్రతిస్పందన సమయం, పెండింగ్ కేసులు పరిశీలించారు. విధిగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ.. వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని అన్నారు. రౌడీ షీటర్లపై దృష్టి పెట్టాలని, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితుల ఫిర్యాదుపై వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏసీపీ తిరుపతి రెడ్డి, సిఐ సాగర్, ఎస్త్స్ర గోపి పాల్గొన్నారు.