5 August, 2026 | 1:59 AM

మానసిక వ్యాధిగ్రస్తులకు సమాజం అండగా నిలవాలి

05-08-2026 01:13 AM

నాగోల్‌లో అవగాహన సదస్సు 

నాగోల్, ఆగస్టు 4 (విజయ క్రాంతి): నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలోని మీన్స్ మెడికల్ ఎడ్యుకేషన్ నేచర్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో రామంతపూర్ జేఎస్పీఎస్ హోమియో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన ఉస్మానియా ఆసుపత్రి సైకియాట్రిస్ట్ డాక్టర్ లోకేష్ చౌహాన్ మాట్లా డుతూ, మానసిక వ్యాధిగ్రస్తులను చిన్నచూ పు చూడకుండా వారికి సరైన చికిత్స అం దించి సాధారణ జీవితంలోకి తీసుకురావ డం సమాజం బాధ్యత అని అన్నారు.

మానసిక వ్యాధి కూడా ఒక రుగ్మతేనని, వారికి తోడుగా నిలవడం మానవ సేవతో సమానమని పేర్కొన్నారు. మీన్స్ మెడికల్ ఎడ్యుకే షన్ నేచర్ సర్వీస్ సెంటర్ గత 20 సంవత్సరాలుగా మానసిక వ్యాధిగ్రస్తులకు ఆశ్రయం కల్పిస్తూ సేవలు అందిస్తోందని ఆయన ప్రశంసించారు. సెంటర్ నిర్వాహకుడు డాక్టర్ జ్ఞాన ప్రకాష్ మాట్లాడుతూ, మానసిక వ్యాధిగ్రస్తుల సేవలో భాగస్వాములు కావాలని, దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో జేఎస్పీఎస్ హోమియో కళాశాల అధ్యాపకుడు శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.