6 June, 2026 | 6:09 PM

Breaking News

వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •  

చర్లలో అంగన్వాడీల ధర్నా

06-06-2026 05:04 PM

ప్రీ ప్రైమరీ విద్య అంగన్వాడీల్లోనే కొనసాగించాలని డిమాండ్.

చర్ల,(విజయక్రాంతి): ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే అమలు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో చర్లలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ధర్నా చేశారు. సిడిపిఓ, ఎమ్మార్వో, ఎంఈఓ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపి వినతి పత్రాలు అందజేశారు. సిఐటియు మండల కన్వీనర్ పాయం రాధాకుమారి మాట్లాడుతూ నూతన విద్యా విధానంతో ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేస్తున్నారని, 4,000 అంగన్వాడీ కేంద్రాలను మూసివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

డిమాండ్లు: 

ప్రీ ప్రైమరీ విద్య అంగన్వాడీల్లోనే కొనసాగించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, 1వ తేదీన రూ.18,000 జీతం ఇవ్వాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి. డిమాండ్లు తీర్చకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.