29 July, 2026 | 9:12 PM

Breaking News

రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు   •   నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్స్ పంపిణీ   •   రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి   •   భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తాం   •   జిల్లాలో సర్ ప్రక్రియ 98 శాతం పూర్తి   •   వేద వ్యాసునీ జయంతి ఉత్సవాలు   •   బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు   •   చిట్యాలలో సర్ -2026పై రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం   •  

పెండింగ్ బిల్లులు ఇప్పించాలి

13-06-2026 12:10 AM
  1. డీజీపీకి మాజీ సర్పంచ్‌ల ఫోరం జేఏసీ విజ్ఞప్తి
  2. సీఎంను కలుద్దామంటే అరెస్టులు
  3. సమస్యలు విన్నవించుకునే చర్యలు తీసుకోవాలి
  4. మాజీ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ 

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ అభివృద్ధికి గాను చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను ఇప్పించేలా చూడాలని  డీజీపీ సీవీ ఆనంద్‌కు మాజీ సర్పంచ్‌ల ఫోరం జేఏసీ విజ్ఞప్తి చేసింది. సీఎంను కలిసేందుకు వెళుతుంటే పోలీసులు అరెస్టు చేస్తున్నారని అన్నారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని, ఆయన్ను కలిసేలా చర్యలు తీసుకోవాలని జే ఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ కోరా రు. శుక్రవారం యాదయ్య గౌడ్ నేతృత్వంలో డీజీపీని కలిసి వినితిపత్రం అందజేశా. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 31 నెలలైనా మాజీ సర్పంచ్‌ల బిల్లులు చెల్లించడం లేదన్నారు.

దీంతో మాజీ సర్పంచులు ఆర్థిక ఇబ్బందు లతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తమ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని వాపోయారు. తమను సీఎం రేవంత్‌రెడ్డితో కల్పించి సమస్యలను పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని డీజీపీని కోరామన్నారు. డీజీపీని కలిసిన వారిలో సంఘం కార్యదర్శి కేశబోయిన మల్లయ్య యాదవ్, వై అరవింద్ రెడ్డి, సముద్రాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.