26 May, 2026 | 2:17 AM

హెచ్‌ఐవీ పరీక్షా కిట్లకు ఇబ్బందులు లేకుండా చూడాలి

26-05-2026 01:24 AM

ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ జయలక్ష్మి

సూర్యాపేట, మే 25 (విజయక్రాంతి): ఎయిడ్స్ పరీక్షకిట్లకు దవాఖానాలు ఇటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ జయలక్ష్మి అన్నారు. సోమవారం ఎయిడ్స్ సురక్ష కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బంది పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం డిఎంహెచ్ ఓ వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్ ఎయిడ్స్, లేప్రోసి డాక్టర్ ప్రసీద్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె 95-95-99 సూచికలు, హెచ్‌ఐవీ పరీక్షా కిట్లు, ఇతర వినియోగ సామగ్రి సరఫరా అంశాలను అడిగి తెలుసుకునీ పలు సూచనలు చేశారు.

తదుపరి ఏఆర్టీ సెంటర్ పరిశీలించారు. ఎల్‌ఎఫ్యూ కేసులను తగ్గించాలని సిబ్బందికి సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా స్థిరమైన రోగులకు ఎంఎండీ అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కామేశ్వరరావు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సిబ్బంది సుధాకర్, ఐసీటీసీ, పీపీటీసీటీ, ఏఆర్టీ, సురక్ష కేంద్ర సిబ్బంది, ఎన్జీవో బృందాలు పాల్గొన్నారు.