8 June, 2026 | 4:39 PM

పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి

08-06-2026 03:44 PM

కొమురవెల్లి,(విజయక్రాంతి): రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కొమురవెల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి కర్ణాకర్ సూచించారు. మండల కేంద్రమైన కొమురవెల్లిలో గ్రామ సర్పంచ్ గొల్లపల్లి పద్మ ఆంజనేయులు అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పారిశుద్ధ్య పనులు, పంట మార్పిడి, ఓటర్ జాబితా, సాగునీటి సౌకర్యాలు, నీటి నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం గ్రామస్తులు కోతుల బెడద గురించి గ్రామ సభ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కార్యదర్శి కరుణాకర్ కోతుల బెడద సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోతుగంటి శ్రీనివాస్, వార్డు సభ్యులు గజ్జె వెంకటేష్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.