12 August, 2026 | 9:25 PM

అక్రమాలను తొలగించి రహదారి సౌకర్యాన్ని మెరుగుపరచాలి

12-08-2026 07:51 PM

ప్రజావాణిలో విజ్ఞప్తి

పాల్వంచ,(విజయకాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాల్వంచలోని 40వ డివిజన్ పరిధిలో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, ఎస్బిఐ ఎదురుగా ఉన్న రోడ్డు ఆక్రమణలను తొలగించి ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపరచాలని బుధవారం ప్రజావాణిలో పాల్వంచకు చెందిన గుండ్ల వెంకటేశ్వర రావు దరఖాస్తు చేశారు.  అధికారిక రికార్డుల ప్రకారం రోడ్డు సర్వే నిర్వహించి నిర్ధారించటంతో పాటు, అక్రమ నిర్మాణాలను, అక్రమణాలను తొలగించాలని ఆయన కోరారు. ఆ రోడ్డులో ఇబ్బడి ముబ్బడిగా ఆక్రమణలు ఉండటంతో వాహనచోదకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. రోడ్డుపైన మెట్లు, రాంపులు, దుకాణాల పొడిగింపు, గోడలు ఇతర ఆక్రమణలు ఉన్నట్లయితే నిష్పక్షపాతంగా, చట్టపరంగా వ్యవహరించి తొలగించాలని ఆయన కోరారు. తాను చేసిన ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యంగా  పరిగణించి  స్థల పరిశీలన తేదీని నిర్ణయించి, సంబంధిత అధికారుల సమక్షంలో సర్వే నిర్వహించాలనే ఆయన కోరారు.