12 August, 2026 | 9:25 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కాలం చెల్లింది

12-08-2026 07:55 PM

రైతాంగ సమస్యలు పట్టని మోడీ 

అదానీ, అంబానీలకు దాసోహం అంటున్న మోడీ

అయోధ్య రాముడి ట్రస్టుపై నోరు మెదపని మోదీ

ఉద్యోగ కల్పన ఊసు ఎత్తని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

సూర్యుడు అస్తమించాడు.. కమ్యూనిస్టులు కనుమరగువ్వరు.

సిపిఐ జాతీయ నాయకు భాగం హేమంతరావు

అశ్వారావుపేట,(విజయ క్రాంతి): కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలను పట్టించుకొనే పరిస్థితిలో లేదని, అదానీ, అంబానీలకు దేశాన్ని ఎలా దోచిపెట్టాలా అనే ఆలోచనలో ఉంటుందని సిపిఐ జాతీయ నాయకులు బాగం హేమంతరావు  అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సి పి ఐ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర  బుధవారం అశ్వారావుపేట చేరుకొని ముగింపు సభను నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ సలీం అధ్యక్షతన జరిగింది. కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తెచ్చి  కార్మికుల గొంతు కోసింది అన్నారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచిన 6 గ్యారెంటీ లను అమలు చేయలేదు అన్నారు.

రేవంత్ ప్రభుత్వం కూడా ప్రజలను మోసం చేసింది అన్నారు.  అశ్వారావుపేట లోని పేదలు ప్రభుత్వ భూమిలో వేసుకున్న గుడేసలకు ఇంటి పట్టాలు ఇస్తామని ఎన్నికల సమయం లో హామీలు ఇచ్చి , నిర్ధాక్షణగా స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు కూల్చివేశారని అన్నారు. ఆటో డ్రైవర్ల పొట్ట  కూడా కొట్టిందన్నారు. ఈ సభలో సి పి ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా,  నర్రాటి ప్రసాద్, విశ్వనాధం, తదితరులు ప్రసంగించారు.