calender_icon.png 12 February, 2026 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాడులను ప్రోత్సహించడం సరైన రాజకీయం కాదు: మాజీ ఎమ్మెల్యే

12-02-2026 12:35:00 AM

మిర్యాలగూడ, ఫిబ్రవరి 11: దాడులను ప్రోత్సహిస్తూ రాజకీయం చేయడం సరికాదని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా మిర్యాలగూడలో 29 వార్డులో నిర్వహిస్తున్న ఎన్నికలలో భాగంగా బూతులో కూర్చున్న ఏజెంట్ల పై అధికార పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .

వీరిని పరామర్శిచ్చేందుకు  వెళ్లిన బిఆర్‌ఎస్ నేత నల్లమోతు సిద్ధార్థ పై రౌడీ మూకలు ఒక్కసారిగా దాడి చేయగ ఇదే సమయంలో సిద్ధార్థ వెంట ఉన్న నేతలు ప్రతిఘటించడంతో సిద్ధార్థ కు పెను ప్రమాదం తప్పిందన్నారు. ఇలాంటి రాజకీయాలను స్థానిక ఎమ్మెల్యే దాడులు చేసి సీట్లు గెలవాలని ఆలోచనతో కొంతమందిని పురమాయించి దాడులకు పాల్పడడం సరికాదన్నారు. గత 40 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నప్పటికీ రౌడీ మూకల దాడులతో ఎన్నికలలో గెలవలేదన్నారు ఇలాంటి రాజకీయాలను ప్రోత్సహించి యువతను పాడు చేయొద్దని కోరారు ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు