22 April, 2026 | 12:06 PM

Breaking News

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •   పీసీ ఘోష్ కాళేశ్వరం నివేదికపై తుది తీర్పు   •   ఆర్టీసీ కార్మికుల సమ్మె— రోడ్డెక్కని బస్సులు   •   కామారెడ్డి బస్టాండ్‌లో ఉద్రిక్తత.. బస్సు గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు   •   తెలంగాణలో ఆర్టీసీ సమ్మె— ప్రయాణికులకు తిప్పలు   •   సత్తుపల్లిలో హోరెత్తిన ఆర్టీసీ సమరభేరి: స్తంభించిన రవాణా వ్యవస్థ   •  

కాంగ్రెస్, టీఆర్పీ నాయకుల బాహాబాహీ

12-02-2026 12:33 AM

సూర్యాపేట, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి) : మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా సూర్యాపేట లోని 13వ వార్డు గాంధీ నగర్ లో కాంగ్రెస్, టిఆర్పి నాయకుల మధ్య వివాదం తలెత్తి బాహాబాహీకి దిగారు. దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపణలు రావడంతో పోలింగ్ కేంద్రం వద్ద ఇరు పార్టీల మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో నగదును పంపిణీ చేస్తున్నారని వాదనలు బయటకు రావడంతో వివాదం మరింత ముదిరి ఇరువురి మధ్య తోపులాట జరిగింది.

దీన్ని గమనించిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అయితే కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసినప్పటికీ పోలీసులు సరైన విధానంలో స్పందించ లేదని.. తమ కార్యకర్తలపై దాడి చేసిన వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ జనగాం_ సూర్యాపేట ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధర్నా కారణంగా వాహనాలు కొద్దిసేపు నిలిచిపోయాయి. అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసి ధర్నాలు విరమింప చేసి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు.