calender_icon.png 12 February, 2026 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్, సీపీఎం పోలింగ్ ఏజెంట్లపై దాడి

12-02-2026 12:36:39 AM

మిర్యాలగూడ, ఫిబ్రవరి 11: మిర్యాలగూడ మున్సిపాలిటీకి బుధవారం జరిగిన ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్న టిఆర్‌ఎస్, సిపిఎం మనకు చెందిన వ్యక్తులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు దిగడంతో గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం పోలింగ్ సమయం ముగిసిన అనంతరం 20 వ వార్డులో బీ ఆర్ ఎస్ నాయకులు అశోక్ దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని ఆరోపించగా కాంగ్రెస్ కార్యకర్తలు విబేధించి వివాదానికి దిగినట్లు తెలిపారు.

ఈ ఘటనలో అశోక్ చొక్కా చిరిగి స్వల్ప గాయాలు అయ్యాయన్నారు. కాగా పట్టణం లోని బంగారు గడ్డ 29 వ వార్డులో పోలింగ్ ముగిసిన అనంతరం బీ ఆర్ ఎస్ సీపీఎంకు పోలింగ్ ఏజెంట్లు గా ఉన్న మస్తాన్, జమీన్ బడే మియాల పై కాంగ్రెస్ అభ్యర్థి జావీద్ దాడి చేశారన్నారు. బాధితులను ఏరియా ఆసుపత్రికి తరలించగా ఇరు పార్టీల మధ్య మరో సారి ఉద్రిక్తలు చోటు చేసుకోగా డీ ఎస్పీ రాజశేఖర్ రాజు జావీద్ అతని అనుచరులపై లాఠీ ఛార్జి చేసి చెదరగొట్టారు.

గాయాలపాలైన ఇద్దరినీ మెరుగైన చికిత్స కోసం నల్గొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగా రెడ్డి, బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు  నల్లమోతు సిద్దార్ధ లు ఏరియా ఆసుపత్రికి చేరుకొని కార్యకర్తలను పరామర్శించి అధికారపార్టీ  నాయకుల దౌర్జన్య కాండను ఎదిరించారు. ఈ క్రమంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వారి పై కర్రలు రాళ్లు విసిరినట్టు తెలిపారు.