జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వడం అభినందనీయం
జవహర్ నగర్, జూన్ 2(విజయక్రాంతి): జాతీయస్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీలకు సీఆర్పీఎఫ్ విద్యార్థులుఎంపికవ్వడం అభినందనీయమని డీఐజీపీ వీర్రాజు అన్నారు. జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకుఎంపికైన విద్యార్థులకు ప్రిన్సిపల్ డి. అపర్ణ ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ క్యాంపస్ లో వీర్రాజు డీఐజీపీసమక్షంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వీర్రాజుడీఐజీపీ హాజరై మాట్లాడుతూ మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూ యువత చదువు, క్రీడలవైపుదృష్టి సారించాలనిపిలుపునిచ్చారు.
క్రీడలతో ఉన్నత శిఖరాలకు అధిరోహించవచ్చని తెలిపారు.జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యేలా తీర్చిదిద్దిన పీఈటీ రాజశేఖర్ ను అభినందించారు. ఈనెల 5 నుంచి 8వరకు రాజస్థాన్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, సత్యనారాయణ, రాజశేఖర్, భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






