ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
17-04-2026 09:17 PM
టీఎన్జీవో అధ్యక్షుడు గడ్డం చిరంజీవి
కోదాడ,(విజయక్రాంతి): తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జంట కార్యాచరణ సమితి కోదాడ యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం కోదాడ ఆర్డీఓ ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టారు. టీఎన్జీవో అధ్యక్షుడు గడ్డం చిరంజీవి ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల అధ్యక్ష,కార్యదర్శులు గడ్డం చిరంజీవి, తీగల నరేష్, రావెళ్ల సీతారామయ్య, వేనేపల్లి శ్రీనివాసరావు, బంధం వెంకటేశ్వర్లు, ఆర్సి రెడ్డి,రామ నరసయ్య, బడుగుల సైదులు, పాండురంగాచారి, అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.






