మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక
15-06-2026 08:47 PM
గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగసాని శ్రీనివాస్ తెలిపారు. చద్మల్ తండా గ్రామ అధ్యక్షుడిగా జగదీష్ నాయక్, చర్మల్ గ్రామ అధ్యక్షుడిగా గైని సాయిలు, నాగ్లూర్ గ్రామ అధ్యక్షుడిగా మక్త తానాజీరావు, నేరల్ గ్రామ అధ్యక్షుడిగా శీతపల్లి మారుతి, నేరల్ తండా గ్రామ అధ్యక్షుడిగా బస్సీ బంత్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆయన తెలిపారు.






