30 June, 2026 | 10:38 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

మహిళల స్వయం ఉపాధి కల్పనకు కృషి

05-11-2025 12:14 AM

-200 మంది లబ్దిదారులకు కుట్టు మిషన్లను  పంపిణీ చేసిన  ఆరెకపూడి గాంధీ

-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల పక్షపాతి 

శేరిలింగంపల్లి, నవంబర్ 4(విజయక్రాంతి): ఇందిరమ్మ మైనారిటీస్ మహిళా శక్తి పథకం రేవంతన్న భరోసా కార్యక్రమంలో భాగంగా మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మైనారిటీ ఫైనాన్స్  కార్పొరేషన్ సంస్థ ద్వారా ఉచితంగా 200 మంది మైనారిటీ మహిళ సోదరీమణులకు కుట్టు మిషన్లను కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి,  జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ నవీన్ కుమార్ రెడ్డి తో కలిసి 200 మంది లబ్దిదారులకు అందచేసిన పీఏసీ ఆరెకపూడి గాంధీ.

ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ కుట్టు మిషన్లు అందచేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మహిళలు తమ స్వంత కాళ్ళపై నిలబడి కుటుంబ పోషణకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మహిళల పక్షపాతని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ వెల్ఫేర్ రీజినల్ ఆఫీసర్ కులకర్ణి, ఏజీఏమ్ పాసరి, షాజియా బేగం, నజియా బేగం,మాజీ కౌన్సిలర్లు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.