30 June, 2026 | 9:47 PM

Breaking News

మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •  

నేడు మల్లంపల్లి కెనాల్ దగ్గర ఎన్‌హెచ్ రహదారి మూసివేత

05-11-2025 12:16 AM

ములుగు, నవంబర్ 4 (విజయక్రాంతి): ములుగు జిల్లా మల్లంపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద జాతీయ రహదారి (ఎన్హెచ్) బ్రిడ్జి నిర్మాణం సందర్భంగా బుధవారం ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వాన దారులు సహకరించాలని నేషనల్ హైవే ఏఈ చైతన్య మంగళవారం తెలిపారు.

కెనాల్ వద్ద రోడ్డు నిర్మాణం చేపడుతున్న దృష్ట్యా వాహనాల రాకపోకలతో ఇబ్బందులు జరుగుతున్నందున ఒక్కరోజు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ములుగు నుండి హనుమకొండ వెళ్లే వాహనాలు భారీ వాహనాలు అబ్బాపూర్ మీదుగా చిన్న వాహనాలు భూపాల్ నగర్ మీదుగా వెళ్లాలని, అదేవిధంగా హనుమకొండ నుంచి వచ్చే భారీ వాహనాలు గూడెపాడ్ వయా పరకాల మీదుగా చిన్న వాహనాలు శ్రీనగర్ భూపాల్ నగర్ మీదుగా ములుగు వెళ్లాలని ఆయన తెలిపారు. వాహనాలదారులు సహకరించాలని ఆయన కోరారు.