సమాజానికి ఉపయోగపడే వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియే విద్య
నల్ల మల్లారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి నల్ల మల్లారెడ్డి
ఘట్ కేసర్, ఆగస్టు 11 (విజయక్రాంతి): విద్య అనేది సమాజానికి ఉపయోగపడే వ్య క్తిత్వాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియ లాంటిదని నల్ల మల్లారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి నల్ల మల్లారెడ్డి అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధి, దివ్యనగర్ లోని నల్లమల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నూత నంగా ప్రవేశం పొందిన బీటెక్ విద్యార్థుల కోసం ఓరియంటేషన్ ప్రోగ్రామ్-2026 ను మంగళవారం కాలేజీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. సంస్థ లక్ష్యమైన ‘కంప్లీట్ ఇన్ స్టిట్యూషన్ - కంప్లీట్ ఎడ్యుకేషన్’ను ప్రస్తావిస్తూ, విద్యార్థులను బహుముఖ ప్రజ్ఞ కలిగిన, నిజాయితీ గల సమర్థవంతమైన నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఎడ్యుకేషన్ సొసైటీ చైర్‌పర్సన్ సంధ్యావళి.. విద్యా నైపుణ్యాలతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి యాజమాన్యం అందిస్తున్న సహకారాన్ని వివరించారు. ఇంజినీరింగ్ విద్య పాఠ్యపుస్తకాలు, తరగతి గదులు, పరీక్షలకే పరిమితం కాకూడదన్నారు. వృత్తి విద్యకు మారుతున్న విద్యార్థులు ఇంజినీరింగ్ విభాగాలపై లోతైన అవగాహన పెంపొందించు కోవాలని ప్రిన్సిపాల్ సూచించారు.






