12 August, 2026 | 8:32 AM

ఎన్టీ రామారావు ఉదయాన్నే చికెన్ తినేవారన్న సంగతి అందరికీ తెలిసిందే!

12-08-2026 01:17 AM

శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎంఎస్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణిరెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో దర్శకుడు ఎంఎస్ రాజు మీడియాతో చెప్పి ముచ్చట్లు ఇవీ.. “అగధ’ అంటే లోతైన అంశం, ఓ శూన్యం అని చెప్పుకోవచ్చు.

మనం దేవుడ్ని, దెయ్యాలను కంటితో చూడలేదు. అలాంటి ఫోర్ల్స్‌కు మధ్య జరిగే కథ ‘అగధ’. ప్రస్తుతం సినిమాకి ఓపెనింగ్స్ తీసుకు వచ్చేది యూత్, మాస్ ఆడియెన్స్. ఆ తర్వాత మౌత్ టాక్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్ బయటకు వస్తారు. ఇందులో హారర్, భయపెట్టే అంశాలు మాత్రమే ఉండవు. అన్ని రకాల అంశాలు ‘అగధ’లో ఉంటాయి. దేవుడికి వ్యతిరేకంగా పని చేసే ఓ దుష్ట శక్తిని ‘అగధ’ అన్నట్టు చూపించాను. నేను చూసిన రియాల్టీకి నా ఫాంటసీని జోడించి ఓ మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని తీశాను. 

‘అగధ’ రిలీజ్ అయిన తర్వాత ప్రీక్వెలా? సీక్వెలా? అన్నది చెప్తాను. ఈ మూవీకి ఆ స్కోప్ అయితే ఉంది. ‘అగధ’ ఓ మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ అని మాత్రం చెప్పగలను. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ‘అగధ’ ఉంటుంది. ఎన్టీ రామారావు గురించి నేను మాట్లాడిన వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. దానిపై నేను ఇచ్చే వివరణ ఏంటంటే.. ‘నేను ఇంత వరకు ఏ సినిమాకి కూడా బ్రహ్మ ముహూర్తంలో లేచి పని చేయలేదు. కానీ ‘అగధ’ కోసం ఎన్టీ రామారావులా ఉదయం మూడు గంటలకే నిద్ర లేచేవాడ్ని.

ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని పనిచేశాను అని చెప్పే క్రమంలో అందరికీ తెలిసిన విషయాన్ని నేను సరదాగా చెప్పాను. ఆయన ఉదయాన్నే చికెన్ తింటారు అన్నది అందరికీ తెలిసిందే. రామారావు మీదున్న అంతులేని అభిమానంతోనే ఆ మాటలు నేను సరదాగా అన్నాను. మా నాన్న, రామారావుకు మంచి అనుబంధం ఉంది. మా నాన్నకు రామారావుతో సినిమా చేసే ఛాన్స్ వచ్చినా చివరి నిమిషంలో ఎన్నికల వల్ల మిస్ అయింది. ఆయన నిబద్దత, క్రమశిక్షణను దగ్గర్నుండి చూశాను.