12 August, 2026 | 2:40 AM

ఏబీవీపీ నిరసన

12-08-2026 12:17 AM
  1. జార్ఖండ్ వ్యాప్తంగా బంద్
  2. విద్యార్థులపై లాఠీఛార్జిపై కన్నెర్ర
  3.   110 మంది ఏబీవీపీ కార్యకర్తల అరెస్ట్

రాంచీ, ఆగస్టు 11: జార్ఖండ్ రాష్ట్రంలో నియామక పరీక్షలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆందోళన చేస్తున్న విద్యా ర్థులపై పోలీసుల చేసిన లాఠీచార్జికి నిరసనగా ఏబీవీపీ మంగళవారం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ ఉద్రిక్తంగా మారింది. అనేక ప్రాంతాల్లో రోడ్లను మూసివేశారు. ఎన్‌హెచ్-33 దిగ్బంధించారు. దీంతో మూడు గంటల పాటు ఎక్కడివాహనాలు అక్కడే నిలిచిపోయాయి. జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి ర్యాలీ గా వెళ్తున్న ఏబీవీపీ కార్యకర్తల్లో 110 మందికిపైగా పోలీసులు అరెస్ట్ చేశారు.

సోమవా రం జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన ఉద్యో గ అభ్యర్థులపై ప్రభుత్వం బలప్రయోగం చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. ఏబీవీపీ కార్యకర్తలు కిశోర్‌గంజ్, అర్గోరా, కాంకే ప్రాం తాల్లో రహదారులను మూసివేశారు. హర్ము చౌక్, న్యూక్లియస్ మాల్, కిశోర్‌గంజ్ చౌక్ ప్రాంతాల్లో టైర్లను కాల్చి నిరసన తెలిపారు. దీనివల్ల నగరంలో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. వర్తక, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు మూతపడ్డాయి.

రామ్‌గఢ్ జిల్లాలోని ఎన్‌హెచ్-33 రాంచీ-పాట్నా జాతీయ రహదారిని నేతలు దిగ్బంధించారు. ౩ గంటలపాటు వాహనా లు నిలిచిపోయాయి. పాత అసెంబ్లీ భవనం నుంచి కొత్తభవనం వైపు ప్రదర్శనగా వెళ్తున్న ఏబీవీపీ కార్యకర్తల్లో 110 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో, అదుపులోకి తీసుకున్న కార్యకర్తలతో ఉన్న బస్సు కదలడానికి నిరసన కారులు అనుమతించలేదు.

అనేకమంది ఏబీవీపీ కార్యకర్తలు వాహనం ముందు రోడ్డుపై పడుకున్నారు. దీంతో ఏబీవీపీ కార్యకర్తలు, పోలీసు సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలు మాట్లాడుతూ.. యువత, విద్యార్థుల గొంతుకను అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.‘లక్షలాది మంది విద్యార్థుల గొంతుకను అణచివేయలేమని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.

పరీక్షల అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలి’ అని డిమాండ్ చేశారు. ఉద్యోగం సాధించడం కోసం తాము రేయింబవళ్లు చదువు తుంటే, పరీక్షా పత్రాలు లీక్ అవుతున్నాయి. పైగా మాపై లాఠీఛార్జ్ చేస్తున్నారు. ఇదేం న్యాయం? అని ప్రశ్నించారు. జార్ఖండ్‌లో పోటీ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలపై విద్యార్థులు ఆందోళన చేస్తున్నది తెలిసిందే.