బస్సు రాదాయే.. బాధ తీరదాయే!
- రోడ్డు పూర్తునా ఆర్టీసీ బస్సు అగుపించకపాయే..
- సూర్యాపేట, సంగెం, తుంగతుర్తి రూట్‌లో ఆర్టీసీ బస్సుల నిలిపివేత
- ఏడాదిన్నరగా ఆ రూట్‌లో ఆగుపించని బస్సు
- ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్న మూడు మండలాల ప్రజలు
- బస్సులు పునరుద్ధరించాలని వినతి
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఆగస్టు11: గతంలో సజావుగా నడిచిన ఆర్టీసీ బస్సు రో డ్డు పనులు జరుగుతుండడంతో ఆ దిశలో అధికారులు నిలిపివేశారు. అయితే రోడ్డు ప నులు పూర్తి అయినప్పటికీ బస్సు రాకపోకలు పునరుద్ధరించకపోవడంతో ప్రజలు ప్ర యాణానికి అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తిమ్మాపురం-సంగెం రహదారి విస్తరణ పను లు పూర్తయ్యాయి.
ఏడాదిన్నర నుంచి ఈ రహదారి పనులు జరుగుతుండడంతో ఈ రూట్లో ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. గతంలో సూర్యాపేట నుంచి తి మ్మాపురం మీదుగా కోడూరు ,సంగెం, అ న్నారం,తుంగతుర్తి వరకు ఆర్టీసీ బస్సులు న డిచేవి.ప్రస్తుతం రోడ్డు పనులు పూర్తయినా బస్సులను పునరుద్ధరించకపోవడంతో మూ డు మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రైవేటు వాహనాల్లోనే ప్రయాణం
ఈ రహదారి గుండా జా జిరెడ్డిగూడెం,తుంగతుర్తి, నూతనకల్ మండలాల ప్రజ లు నిత్యం తమ రాకపోకలు సాగిస్తుంటారు.రోడ్డు పను లు జరుగుతున్నాయని అధికారులు బస్సులను నిలిపివేయ డంతో మూడు మండలాల ప్రజలు ఆ టోలు ,బైకులను ఆశ్రయిస్తున్నారు.రోడ్డు పూర్తయినా.. ఆర్టీసీ అధికారులు బస్సులను పునరుద్ధరించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు.ఈ ప్రాంతంలో ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు వెళ్లేందు కు ఆటోలే దిక్కు అవుతున్నాయి.
ఈ ఆటోలు కూడా ప్రయాణికులతో పూర్తిగా నిండితేనే కదిలేది.అవి కూడా సమయానికి రాకపోవడంతో విద్యార్థులు,వివిధ పనుల నిమిత్తం వె ళ్లేవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక మహిళలైతే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని తాము వినియోగించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
బస్సులు రాక ఇబ్బందులు
ఏడాదిన్నర నుంచి రోడ్డు పనులు జరుగుతున్నందున ఆర్టీసీ అధికారులు బస్సులను రోడ్డు పనులు పూర్తయినందున వెంటనే బస్సులు నడిపించాలి.పనుల మీద వేరే ఊరికి వెళ్లేందుకు బస్సులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కంకరబోయిన యాదగిరి, కోడూరు గ్రామస్తుడు.






