12 August, 2026 | 8:31 AM

నేడు నల్లగొండకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాక

12-08-2026 01:15 AM

నల్లగొండ, ఆగస్ట్ 11 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ బుధవారం నల్లగొండ జిల్లాలో పర్యటించ నున్నట్లు జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యా హ్నం 3 గంటలకు జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్లోని ఉదయాదిత్య భవన్లో సమీక్షా సమా వేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు సభ్యులు కుష్రుమ్ నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకతి లక్ష్మీనారాయ ణ,

జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్ లు ఈ సమీక్షలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన భూ సమస్యల పరిష్కారం, ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడు లు, చట్టపరమైన చర్యలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రోస్టర్ పాయింట్ల పక్కా అమలు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ప్రగతి అంశాలపై సమీక్షించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాధాన్యత కలిగిన సమీక్షా స మావేశానికి జిల్లా స్థాయి అధికారులు, ము న్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్సీఓలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తప్ప నిసరిగా హాజరుకావాలన్నారు.