12 August, 2026 | 2:41 AM

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల ఆటల పోటీలు

12-08-2026 01:16 AM

దామరచర్ల, ఆగస్టు 11 : ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులమండల స్థాయి ఆటల పోటీలను దామరచర్లలోని భవిత కేంద్రంలో మంగళవారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల పరిధిలోని వివిధ పా ఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.వివిధ క్రీడా పోటీ ల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విజేతలుగా ఎంపిక చేసి బహుమ తులు అందజేశారు.

ఈ సందర్భంగా మండ ల విద్యాధికారి సైదా నాయక్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించడమే సమగ్ర శిక్ష లక్ష్యమని తెలిపారు. క్రీ డలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఇ తర పోటీల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్ర మాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కా ర్యక్రమంలో ప్రత్యేక ఉపాద్యాయులు కవిత ,ఎల్ రవి ,ఎన్ లక్ష్మీ ,విద్యార్థుల తల్లిదండ్రు లు పాల్గొన్నారు..