రాజరాజేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
12-08-2026 12:02 AM
కుబీర్ , ఆగస్టు 11(విజయ క్రాంతి); కుభీర్ మండలంలోని పార్డి-బి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో తళ సప్తమి వేడుకల్లో వేడుకల్లో ముధోల్ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. తళ సప్తమి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, గ్రామస్థులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






