డ్రైవర్ల కంటి వెలుగు రహదారి భద్రతకు అడుగు
నగరంలో అరైవ్ అలైవ్ 2
బంజారాహిల్స్, ఫిబ్రవరి 27(విజయక్రాంతి):హైదరాబాద్లో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ 2 దశ ఘనంగా ప్రారంభమైంది. రవాణా రంగం లో కీలకమైన ఆటో, క్యాబ్, ట్యాంకర్ డ్రైవర్ల దృష్టి లోపాలను సరిదిద్ది వారికి రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కంటి పరీక్షల శిబిరాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ సమయంలో అప్రమత్తత అత్యవసరమని, ఇతరుల తప్పుల వల్ల జరిగే ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకునే డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులను అలవా టు చేసుకోవాలని సూచించారు.
సీట్ బెల్ట్ ధరించడం, లైసెన్స్ కలిగి ఉండటం, ఓవర్టేకింగ్ నియమాలను పాటించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవ చ్చని నొక్కి చెప్పారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ డీసీపీ కాజల్ సింగ్ మాట్లాడుతూ డ్రైవర్లు తమ ఆరోగ్యం పై, ముఖ్యంగా కంటి చూపుపై శ్రద్ధ వహించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులతో పాటు వెనుక కూర్చునే వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.
డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ వాడటం వంటి పరధ్యానాలకు దూరంగా ఉండాలని హితవు పలికా రు. విన్ విజన్, ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రుల సహకారంతో నిర్వహించిన ఈ శిబి రంలో వందలాది మంది డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి, ఏసీపీ హరిప్ర సాద్, వివిధ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, వైద్య నిపుణులు పాల్గొని డ్రైవర్లకు దిశానిర్దేశం చేశారు.




