నావంద్గీలో రైలు నిలుపుదలతో ప్రయాణికుల సమయం,డబ్బు ఆదా : ఎంపీ కొండా
తాండూరు, ఫిబ్రవరి 27,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా నవాంద్గీ రైల్వే స్టేషన్ లో హుబ్లీ ఎక్స్ప్రెస్ రైలు నిలుపుదల తో ప్రయాణికులకు డబ్బు, సమయం ఆదా అవుతుందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.
శుక్రవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో కలిసి హుబ్లీ ఎక్స్ప్రెస్ రైలు నిలుపుదల ను ప్రారంభించారు . ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడి నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు మరియు స్థానిక ప్రజలందరి చిరకాల కోరిక హుబ్లీ ట్రైన్ బషీరాబాద్ లో నిలువాలని ఉండేదని నేటితో వారి కల తీరిందని.బషీరాబాద్ మరియు పరిసర గ్రామాల ప్రజలు రాష్ట్ర రాజధాని హైదరబాద్ వెళ్లేందుకు ఇబ్బందులు ఉండేవి,ఇప్పుడు హుబ్లీ ట్రైన్ నిలుపుదలతో ప్రయాణికులకు రవాణా సౌకర్యం మెరుగవుతుందని అన్నారు.
రైలు ఆపేందుకు గాను సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మరియు సంబంధిత అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు,




