ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నాటక పోటీలు
12-03-2026 12:35 AM
మహబూబాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో చైతన్య కళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 14వ జాతీయ తెలుగు ఆహ్వానిత నాటక పోటీల్లో ప్రదర్శిస్తున్న నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
రెండో రోజు నాటిక పోటీలను ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు ప్రారంభించారు. గ్రామీణ స్థాయి లో కళా రంగం పట్ల ఆసక్తి పెంపొందించే విధంగా గత కొన్నేళ్లుగా చైతన్య కళా సమా ఖ్య చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ము త్యం వెంకన్న, సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ జినుగా సురేందర్ రెడ్డి, ప్రతినిధులు మంగళంపల్లి శ్రీనివాస్, పినాకపాణి, గడల శ్రీని వాస్, లీగల వెంకట్రెడ్డి పాల్గొన్నారు.




