ఇందిరమ్మ కమిటీని రద్దు చేసి పూర్తి బాధ్యతలు సర్పంచులకు ఇవ్వగలరు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ఎనిమిది గ్రామపంచాయతీలకు ఆర్థిక సంవత్సరం 2026-27కు రావలసిన ఉపాధి హామీ నిధులను విడుదల చేసి గ్రామ అభివృద్ధి పనులకు సహకరించవలసిందిగా, ఇందిరమ్మ కమిటీని రద్దు చేసి పూర్తి బాధ్యతలు సర్పంచులకు ఇవ్వాలని కోరుతూ 8 గ్రామాల సర్పంచులు స్థానిక ఎంపీడీవో ప్రవీణ్ కుమార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఇందిరమ్మ ఇండ్లను గ్రామ పాలకవర్గం నిర్ణయించిన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వగలరని
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పరిధిలోని ఎనిమిది గ్రామపంచాయతీలలో మాల్తుమ్మెద, వాడి, బంజర తండా,మెల్లకుంట తండా, బెజ్గం చెరువు తండా, చిన్న ఆత్మకూర్,ధర్మారెడ్డి,కన్నారెడ్డి గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 కుగాను ప్రభుత్వం నుండి రావలసిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు ఇంతవరకు విడుదల చేయలేదని ఈనిధులు సకాలంలో అందకపోవడం వల్ల 8 గ్రామాల్లో అత్యంత అవసరమైన ప్రాధాన్యత కలిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయలేకపోతున్నామని,
ముఖ్యంగా గ్రామ ప్రజల రవాణా, ఆరోగ్య సౌకర్యాలకు సంబంధించిన కొత్త సిసి రోడ్ల నిర్మాణం మురికి నీటి పారుదల కొరకు చేపట్టవలసిన కొత్త డ్రైనేజీ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని,దీనివల్ల గ్రామస్తులు ముఖ్యంగా వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు.కావున నాగిరెడ్డిపేట మండలంలోని 27 గ్రామపంచాయతీలో 19 గ్రామపంచాయతీలకు నిధులు ఇచ్చి 8 గ్రామపంచాయతీలు నాగిరెడ్డిపేట మండలానికి సంబంధించిన గ్రామాలే కావున పరిస్థితిని పరిశీలించి నిలిచిపోయిన ప్రగతి పనులను పున:ప్రారంభించడానికి వీలుగా సదురు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ నిధులను త్వరితగతిన విడుదల చేయవలసిందిగా కోరుతూ 8 గ్రామాల సర్పంచులు వినతి పత్రంలో పేర్కొని స్థానిక ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు వంశీకృష్ణ గౌడ్,పుప్పాల సాయిలు,మహేందర్,సురేష్, బాల్యనాయక్,భాస్కర్,అనిత లచ్చయ్య,లక్ష్మీనారాయణ, సాయిలు ఉన్నారు.






