1 August, 2026 | 7:15 PM

Breaking News

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గృహిణి అదృశ్యం

19-05-2026 07:23 PM

పిఎస్ లో ఫిర్యాదు చేసిన భర్త

జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్ లోని బాలాజీ నగర్ కు చెందిన గృహిణి అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం బాలాజీ నగర్ కు చెందిన గుగులోతు ఉపేందర్ నాయక్ భార్య మౌనిక దంపతులు బాలాజీ నగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఉపేందర్ నాయక్ ఆర్మీ డెంటల్ కాలేజీ సమీపంలో రేడియం షాపు నిర్వహిస్తున్నాడు.

ఈనెల 18వ తేదీన మధ్యాహ్నం భోజనం కొరకు ఉపేందర్ ఇంటికి వెళ్లగా భార్య మౌనిక( 22) ఇంట్లో కనిపించకుండా పోయినట్లు గమనించాడు. ఈ మేరకు ఆమె కోసం చుట్టుపక్కల వెతికినా బంధువుల వద్ద వెతికినా తెలిసిన వారి వద్ద వెతికినా సమాచారం లభించలేదు. మౌనిక  ఫోన్ కు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ లో ఉన్నట్టు తెలిసింది. పొరుగింటి సీసీటీవీ పరిశీలించగా ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఆటోలో వెళ్లినట్టు గుర్తించారు. ఈ మేరకు ఉపేందర్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.