1 August, 2026 | 6:06 PM

Breaking News

విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తున్న ప్రభుత్వం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి   •   సోనాల మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు   •   అనురాగ్ లో కెరీర్ క్యాటలిస్ట్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఫర్ ప్లేస్మెంట్ సక్సెస్ వర్క్ షాప్   •   గోదావరి ఉధృతి.. జలదిగ్బంధంలో బూర్గంపాడు   •   వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •   ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •  

దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్

19-05-2026 07:15 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని సాగర గ్రామానికి చెందిన జాదవ్ దేవి కా బాయ్ అనే మహిళ ఇంట్లో నుండి ఈనెల 13న 70 వేల రూపాయలు దొంగతనం జరిగినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన ఎస్ఐ పురుషోత్తం సాంకేతిక ఆధారాలు సేకరించి హనుమాన్ నిధుల పైన దృష్టి సారించారు. అయితే దొంగతనానికి పాల్పడిన వ్యక్తి కదలికను పరిశీలించి గ్రామానికి చెందిన సాయి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనానికి పాల్పడ్డట్టు ఒప్పు కోవడం జరిగిందని సీఐ గురుస్వామి తెలిపారు. దీంతో నిందితుని వద్ద నుండి 70 వేల రూపాయల నగదును రికవరీ చేయడం జరిగిందన్నారు. అనంతరం రిమాండ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు.