చెరువుల సుందరీకరణకు సహకరించాలి
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసిన వజ్రెష్ యాదవ్
మేడిపల్లి,(విజయక్రాంతి): చెరువుల సుందరీకరణ, పరిరక్షణ కోసం సహకరించాలని కోరుతూ మంగళవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ.... బోడుప్పల్ లోని రా చెరువు, పీర్జాదీగూడలోని పెద్ద చెరువు లను పూర్తి స్థాయిలో బండ్ గా తీర్చదిద్దాలని, అదే విధంగా చెంగిచెర్ల చింతల చెరువును సుందరీకరించి కలుషిత జలాలు చెరువులో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మాజీ మేయర్ తోటకుర అజయ్ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గం బీ బ్లాక్ ప్రదాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాయిపేట శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పోరేటర్ బొమ్మకు కళ్యాణ్, అర్టీఏ మెంబర్ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






