19 May, 2026 | 6:22 PM

Breaking News

రేపు జిల్లా కేంద్రాల్లో నిరసనలు

15-03-2026 12:17 AM

ఈ నెల 20న ‘చలో అసెంబ్లీ’ యూటీఎఫ్ నేతలు

హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి) : కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బం ది సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా, డివిజన్ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లు చావ రవి, ఎ.వెంకట్ తెలిపారు.

కనీస వేతనాలు అమలు చేయాలని, సర్వీసులు క్రమబద్దీకరించాలని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సెలవులు ఇవ్వాలని, వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని తదితర డిమాండ్లతో దశల వారీగా పోరాటానికి పి లుపునిచ్చామని, మొదటి దశగా మార్చి 9న పాఠశాల స్థాయిలో నిరసనలు నిర్వహించామని, మూడవ దశలో మా ర్చి 20న ఛలో అసెంబ్లీ నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరించాలని వారు డిమాం డ్ చేశారు.