17 March, 2026 | 7:08 PM

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

17-03-2026 05:23 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ పిలుపుమేరకు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కు వినతి పత్రంఅందజేశారు. ఈ సందర్బంగా మండల బీజేపీ అధ్యక్షులు కుంట రాంరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు పరచడంలో  పూర్తిగా విఫలం అయ్యిందన్నారు.

అర్హులైన  పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని, నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి ప్రకటించాలని, రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అర్హులైన పేదలకు వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలన డిమాండ్ చేశారు.లేనిచో బీజేపీ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని తెలిపారు.