6 April, 2026 | 4:29 AM

శాతవాహన వీసీపై తప్పుడు ప్రచారం చేయద్దు

06-04-2026 02:29 AM

కొత్తపల్లి, ఏప్రిల్ 5(విజయక్రాంతి): శాతవాహనవిశ్వవిద్యాలయంలో ఇటీవల జరు గుతున్న కార్యకలాపాల గురించి కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయని, విశ్వవిద్యాలయ ఉపకులపతిపై కొందరు తప్పుడు వదంతు లు సృష్టిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మన వీసీపై చేస్తున్న ఆరోపణలను కాం ట్రాక్టు ఉపాధ్యాయుల సంఘం తరపున మే ము తీవ్రంగా ఖండిస్తున్నాముని కన్వీనర్ డా జోసెఫ్ రాజు ప్రకటనలో తెలిపారు.

వీసీ ప్ర స్తుతం విద్యార్థులను, సిబ్బందిని కలుపుకొం టూ అందరి సహకారంతో, ఏలాంటి కుల, మత వివక్ష లేకుండా విశ్వవిద్యాలయ ప్ర యోజనం కోసం భారీ విద్యా, మౌలిక సదుపాయాల అభివృద్ధి కొరకు బాటలు వేస్తున్న క్రమంలో, విశ్వవిద్యాలయం మేలైన దిశలొ సాగుతోందని అన్నారు.