6 April, 2026 | 4:24 AM

విద్యుత్ సేవలపై సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి సమీక్ష

06-04-2026 02:42 AM

వేములవాడ, ఏప్రిల్ 5, (విజయక్రాంతి) టీజీఎన్పీడీసియల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామిని ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అ ర్చకులు ఘన స్వాగతం పలకగా, వేద పండితుల ఆశీర్వచనాలు అందించారు. ఏఈఓ జి. శ్రవణ్ కుమార్ శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు.అనంతరం చెక్కపల్లి రోడ్డులోని సబ్స్టేషన్, 132/33 కేవీ సబ్స్టేషన్లను పరిశీలించి విద్యుత్ సరఫరాపై సమీక్షించారు.

గత ఐదు రోజుల్లో 250 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న 2500 కనెక్షన్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.సిరిసిల్ల మగ్గాల కార్మికుల విద్యుత్ బిల్లులను కేటగిరి-3 నుండి 4ఏ కు మార్చుతున్నట్లు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి పొలంబాట కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం చర్యలు తీసు కుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో డీఈ వెంకటరమణ, ఏడీఈ గంగాధర్,అనిల్,విజిలెన్స్ ఎస్‌ఐ ఓంకార్ యాదవ్, తిరుపతి, శ్రీ కాంత్, తదితరులు పాల్గొన్నారు.