మోడీ పాలనను ప్రపంచ దేశాలు గుర్తించాయి
మాజీ ఎంపీ బీబీ పాటిల్
జహీరాబాద్/న్యాల్కల్, జూన్ 10: భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలనను ప్రపంచ దేశాలు గుర్తించాయని జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. నరేం ద్ర మోడీ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన న్యాల్కల్ మండలం రేజింత ల్ గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బీబీ పాటిల్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలనలో దేశం అభి వృద్ధి చెందడంతో పాటు దేశ భద్రత విషయంలో ఎన్నడు లేని విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలు చేపట్టి భారతదేశాన్ని ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.






