19-02-2026 12:00:00 AM
మేయర్ కోలగని శ్రీనివాస్
కరీంనగర్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): బిజెపిపై నమ్మకంతో కరీంనగర్ నగరపాలక సంస్థ బాధ్యతలను అప్పజెప్పిన పట్టణ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నామని, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతతో పనిచేస్తామని, డివిజన్ సమస్యల పరిష్కారం కోసం వారంలో ఒక రోజు డివిజన్లో పర్యటిస్తానని, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మేయర్ కోలగని శ్రీనివాస్ అన్నారు.
బుధవారం కరీంనగర్ పట్టణం 66 డివిజన్లో 13.5 లక్షల నిధులతో చేపట్టిన రోడ్డు, డ్రైనేజీ పనులను డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ వంగల పవన్ లతో కలిసి మేయర్ కోలగని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. నగర అభివృద్ధి కోసంకరీంనగర్ పట్టణ ప్రముఖులు, ప్రజల సూచనలు, అభిప్రాయాలను , సలహాలను పరిగణలోకి తీసుకొని ముందుకు కొనసాగుతామని తెలిపారు.
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో నగరాన్ని మరింత అభివృద్ధి చేసే ఆలోచనతో ఉన్నామని, గతం కంటే మెరుగైన స్థితిలో కరీంనగర్ పట్టణాన్ని అభివృద్ధి దిశలోకి తీసుకు వెళ్లడానికి శాయశక్తుల కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు , కార్పొరేటర్లు వంగల పవన్ , గుగ్గిలపు రమేష్, సోమిడి వేణు ప్రసాద్, బండ రమణారెడ్డి, కె పీ చంద్ర, శ్రీనివాస్, తాటి ప్రభావతి, కన్న కృష్ణ, బిజెపి మీడియా కన్వీనర్ కటకంలోకేష్, నాయకులు చిట్టి కరుణాకర్ సురేష్, లడ్డు ముందడ, తనకు సాయి కృష్ణ , కైలాస నవీన్, తదితరులు పాల్గొన్నారు.